సూర్యాపేటలో జాతీయ ఐక్యతా పరుగు
సూర్యాపేట, అక్టోబర్ 31(ప్రజానేస్తం జ్వాల): సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేటలో జాతీయ ఐక్యతా పరుగు నిర్వహించారు. ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల చౌరస్తా వద్ద ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ పరుగును ప్రారంభించి, విద్యార్థులు, యువత, పోలీసు సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ వరకు పరుగు కొనసాగింది. అనంతరం పటేల్ చిత్రపటానికి నివాళులర్పించి, జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండి, లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడాలని సూచించారు. దేశ ఐక్యత, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ...