నేరేడుచర్లలో మహిళలకు ఉచిత వైద్య శిబిరం
24 మంది మహిళలకు వైద్య పరీక్షలు.. ఆరోగ్య పరిరక్షణపై అవగాహన నేరేడుచర్ల, నవంబర్ 4 (ప్రజానేస్తం జ్వాల): మహిళల ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణపై అవగాహన కల్పించే లక్ష్యంతో మహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, ఎస్బీఐ ఫౌండేషన్ సౌజన్యంతో, లైఫ్ సీబీఓ సహకారంతో సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలోని రామ్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 24 మంది మహిళలు పాల్గొనగా, వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యానికి సంబంధించిన పలు సూచనలు, సలహాలు అందించారు. శిబిరంలో మహిళల ఆరోగ్య పరిస్థితులను వైద్య సిబ్బంది పరిశీలించి, సాధారణ ఆరోగ్య సమస్యలు, వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవన...