హనుమకొండ ప్రజలకు విద్యుత్ అలర్ట్: రేపు పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా బంద్!
హనుమకొండ, 09 నవంబర్ 2026 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్): విద్యుత్ అభివృద్ధి, మరమ్మతు పనుల నేపథ్యంలో మంగళవారం హనుమకొండ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుందని డీఈఈ జి. సాంబారెడ్డి తెలిపారు. బలసముద్రం ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు, నక్కలగుట్ట ప్రాంతంలో ఉదయం 9:00 గంటల నుంచి 11:00 గంటల వరకు విద్యుత్ నిలిపివేయబడుతుంది. అలాగే ములుగు రోడ్ ఫీడర్ పరిధిలో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని స్పష్టం చేశారు. వినియోగదారులు ముందస్తుగా గమనించి శాఖకు సహకరించాలని ఆయన కోరారు.