హుజూర్‌నగర్ మండల ఎమ్మార్పీఎస్ మహిళా అధ్యక్షురాలిగా అమరారపు కుమారి మాదిగ

మహిళా హక్కుల కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలి – నాయకుల పిలుపు హుజూర్‌నగర్, నవంబర్21, ప్రజానేస్తం జ్వాల: మాదిగ మహిళా సంఘాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, మహిళా హక్కుల పరిరక్షణే లక్ష్యంగా హుజూర్‌నగర్ మండల మాదిగ మహిళా సమాఖ్య నూతన కమిటీని ఎన్నుకున్నారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, మాదిగ మహిళా సంఘం నియోజకవర్గ అధ్యక్షురాలు బియ్యంపొంగు విజయ మాదిగ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో హుజూర్‌నగర్ మండల అధ్యక్షురాలిగా అమరారపు కుమారి మాదిగ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా వీరమ్మ మాదిగ, టౌన్ అధ్యక్షురాలిగా రణపంగు నాగమణి, అధికార ప్రతినిధిగా చిట్టిపాక విజయ మాదిగ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ...