తొర్రూరు మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలి. కరువు సహాయక చర్యలు చేపట్టాలి. రైతులకు బ్యాంకు రుణాలు మాఫీ చేయాలి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుణగంటి రాజయ్య.
తొర్రూరు / మహబూబాబాద్ జిల్లా నవంబర్ 24 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి ): తొర్రూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి కరువు సహాయ చర్యలు కింద రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుణగంటి రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తోరూర్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆఫీస్ లో మార్క సాంబయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి గుణగంటి రాజయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ, రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నటువంటి స్థితిలో మహబూబాబాద్ జిల్లాలో ఉన్న 18 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే నీటి ఎద్దడితో పంటలు...