తొర్రూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా 59 జంటలతో సామూహిక సత్యనారాయణ వ్రతం.
మహబూబాబాద్ జిల్లా / తొర్రూరు నవంబర్ 24 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి)/ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో మొదటి ఈ రోజు శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం లో కార్తీక పౌర్ణమి సందర్బంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం 59 మంది జంటలతో స్వామి కథలతో ఉపమానాలతో శ్రావణానందంగా ఆలయ అర్చకులు ఆరుట్ల శ్రీకాంతా చార్యుల చే అంగరంగ వైభవంగా నిర్వహించారు. 2 వ్రతం అనంతరం 239 మంది భక్తులకు భోజనాది ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వపు గవర్నర్ ఆలయ వ్యవస్థపాకులు లయన్ డాక్టర్ గీతా రాజేందర్ రెడ్డి మరొక పూర్వపు గవర్నర్ లయన్ తమ్మేర శారద లక్ష్మనర్సింహా రావు పూర్వపు...