స్మశానం..
దానికి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, నీతి లేదు. ఉన్నోడు లేడు, పేదోడు లేడు, మంచి లేదు, మానవత్వం లేదు. ప్రేమ లేదు, కోపం లేదు, మనస్సు లేదు, మాట లేదు. అందరినీ దాచుకుంటుంది.. ఆఖరి జీవితానికి అమ్మ అవుతుంది.. ఎవరు వెళ్ళాలని అనుకోరు, కానీ చివరకి వెళ్ళేది అక్కడికే అని మరవరు.. నీకున్న గొప్ప మనస్సు. ప్రాణం ఉన్న మనుషులకు లేకుండా పోయింది.. కులం, మతం, జాతి, పైసల కోసం కొట్టుకొని చస్తున్నారు. జిందకి మారిన జీవితంలో బ్రతుకడం మారడం లేదు.. రచయిత: నాగిల్ల రజినీకాంత్