చేయూత పెన్షన్లతో నిరుపేదలకు ఆర్థిక భరోసా
19, 20, 21వ వార్డుల లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ హుజూర్నగర్, నవంబర్ 25 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 19, 20, 21వ వార్డులకు చెందిన చేయూత సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున రావు, 19వ వార్డు కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 19వ వార్డు కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం ద్వారా వితంతువులు, గీత కార్మికులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు సామాజిక భద్రత కల్పిస్తూ పెన్షన్లు అందించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో,...