గోల్డ్ లోన్ వినియోగదారులకు మార్జిన్ షార్ట్‌ఫాల్ చెల్లింపులకు గడువు ఇవ్వాలి

తాకట్టు బంగారం వేలం విషయంలో ఆరు నెలల వెసులుబాటు కల్పించాలి: కక్కిరేణి శ్రీనివాస్ సూర్యాపేట, నవంబర్ 25 (ప్రజానేస్తం జ్వాల): బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న సామాన్య, మధ్యతరగతి వినియోగదారులకు మార్జిన్ షార్ట్‌ఫాల్ చెల్లింపుల విషయంలో తగిన గడువు కల్పించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ కోశాధికారి కక్కిరేణి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బంగారం ధరల్లో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గుల నేపథ్యంలో గోల్డ్ లోన్ వినియోగదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, వ్యాపార అవసరాల కోసం చాలామంది తమ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు...