వడ్లను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి
రైతులు ప్రైవేట్ మిల్లర్లకు అమ్మి మోసపోవద్దు.. అదనపు కలెక్టర్ ఎన్. రవి శాయంపేట, నవంబర్ 26 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి గురువారం శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రైవేట్ రైస్ మిల్లర్లకు వడ్లు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. సన్న వడ్లకు ప్రభుత్వం బోనస్ కూడా అందిస్తోందని తెలిపారు. కొనుగోలు కేంద్రంలో గన్నీ బ్యాగుల కొరతపై ఆరా తీసిన అదనపు కలెక్టర్, అవి అందుబాటులో లేకపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే...