నరేంద్ర మోడీ ప్రభుత్వం విధివిధానాలతో వ్యవసాయ కూలీలకు తీరని నష్టం. దేశ ప్రజల శ్రమను దోచి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న మోడీ ప్రభుత్వ విధివిధానాలు. కార్మిక సంఘాల నాయకులు కొత్తపల్లి రవి, బొల్లం అశోక్, బందు మహేందర్, ఉడుగుల లింగయ్య.

తొర్రూరు మహబూబాబాద్ జిల్లా నవంబర్ 26 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి): దేశ ప్రజల శ్రమను దోచి కార్పొరేట్ కంపెనీలకు కట్టపెట్టే విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ విధివిధానాలు అనుసరిస్తున్నాడని కార్మిక సంఘాల నాయకులు కొత్తపల్లి రవి, బొల్లం అశోక్, బంధు మహేందర్, ఉడుగుల లింగయ్య లు విమర్శించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిర్శిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కే.యం) పిలుపులో భాగంగా గురువారం తొర్రూరు గాంధీ విగ్రహం ఎదురుగా భారీ రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి అన్నం పెడుతున్న వ్యవసాయ కూలీలకు పెద్ద ఎత్తున నష్టం తెచ్చే విధానాలను తీసుకొస్తున్నాడని అన్నారు. ఇప్పటికే...