రాజ్యాంగాన్ని రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం. సిపిఐ తొరూరు మండల కార్యదర్శి బందు మహేందర్. సిపిఐ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం.

తొర్రూరు మహబూబాబాద్ జిల్లా నవంబర్ 26 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి): రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం అని సిపిఐ తొర్రూరు మండల కార్యదర్శి బందు మహేందర్ అన్నారు. గురువారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నవంబర్ 26 రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని సిపిఐ తొర్రూరు మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బందు మహేందర్ మాట్లాడుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు తొర్రూర్ పట్టణ కేంద్రంలోని బిఆర్ అంబేద్కర్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టగా రాజ్యాంగాన్ని రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం నినాదంతో 1949 నవంబర్ 26న...