భారతదేశ పరిపాలనకు న్యాయవ్యవస్థకు రక్షణ చట్టాలకు దిక్సూచి భారత రాజ్యాంగం... బహుజన సామాజిక కార్యకర్త తలారి అశోక్..
తొర్రూరు (హరిపిరాల) మహబూబాబాద్ జిల్లా నవంబర్ 26 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి): భారతదేశ పరిపాలనకు న్యాయవ్యవస్థకు రక్షణ చట్టాలకు దిక్సూచి భారత రాజ్యాంగం అని అలాంటి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదని బహుజన సామాజిక కార్యకర్త తలారి అశోక్ కోరారు. గురువారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తొర్రూరు మండలంలోని హరిపిరల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తలారి అశోక్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం భారతదేశ పాలనకు దిక్సూచి అని అలాంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది అని అన్నారు. అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు సమానమని చాటి...