బహుజన విద్యార్థి సంఘ నాయకుడు మంకాల మల్లేష్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ బయలుదేరిన తొర్రూరు బహుజన నాయకులు.

తొర్రూరు మహబూబాబాద్ జిల్లా నవంబర్ 26 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి): రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నాయకులు,భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బహుజన సేన ఆధ్వర్యంలో నాయకులు ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేరారు.ఈ సందర్భంగా డాక్టర్ అలువాల విజయ్ కుమార్ ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతర హైదరాబాద్‌కు బయలుదేరుతున్న వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పేర్కొన్నారు.ఈ...