రైతులకు భరోసా ఏది.. బోనస్ ఎక్కడ.....? పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేక.. దళారులకే ధాన్యం అమ్ముకునే దుస్థితి... రెండు పంటల బోనస్ కోసం ఎదురుచూస్తున్న రైతులు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు..
తొర్రూరు మహబూబాబాద్ జిల్లా నవంబర్ 26 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి): ...// రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కూడా లభించకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని... రైతుల సంక్షేమమే లక్ష్యమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. గురువారం తొర్రూరు పట్టణంలోని అన్నారం రోడ్డులో భద్రకాళి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను ఆయనకు వివరించారు. సకాలంలో...