సిటీ కేబుల్ జర్నలిస్ట్ యాకూబ్ కుటుంబానికి రూ‌.30 వేల ఆర్థిక చేయూత. దివంగత జర్నలిస్ట్ యాకూబ్ సతీమణి కి అందజేసిన టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్. ఏ జర్నలిస్టు కుటుంబానికి ఆపద వచ్చినా అండగా ఉంటుంది ఐజేయు..

మహబూబాబాద్ నవంబర్ 26 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి):.... మహబూబాబాద్ జిల్లాలో ఏ జర్నలిస్ట్ కు కష్టం వచ్చినా సాధ్యమైనంత మేర టియుడబ్ల్యూజే (ఐజేయు) అండగా ఉంటుందని మహబూబాబాద్ జిల్లా ఐజేయు అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఇటీవల యాకూబ్ మరణించిన రోజు అతనికి నివాళులు అర్పించేందుకు వెళ్ళిన సమయంలో ఆ నిరుపేద కుటుంబం పరిస్థితిని చూసి మనసు చలించిందని, తక్షణ సహాయంగా రూ.5 వేలు ఆ రోజు కార్యక్రమాల నిర్వహణ కోసం అందజేసి.. ఆ కుటుంబానికి ఇంకా కొంత సహాయం చేయాలనే ఆలోచనతో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అనే వాట్సాప్ న్యూస్ గ్రూప్ లో మెసేజ్ పెట్టగానే మానవతా విలువలతో స్పందించిన దాతలు...