భారత రాజ్యాంగ స్ఫూర్తితో బహుజన రాజ్య సాధనకు కృషి చేయాలి. బహుజన మేధావి డాక్టర్ కదిరే కృష్ణ. కదిరే కృష్ణ రచించిన అద్వితీయ నాయకుడు బుక్ ఆవిష్కరణలో తొర్రూరు బహుజన నాయకులు.

హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి)....../ భారత రాజ్యాంగ స్ఫూర్తితో బహుజన రాజా సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బహుజన మేధావి డాక్టర్ కదిరే కృష్ణ ఆకాంక్షించారు. గురువారం హైదరాబాద్ వేదికగా భారత రాజ్యాంగ 77వ దినోత్సవ వేడుకలను బహుజన సేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కదిరి కృష్ణ రచించిన అద్వితీయ నాయకుడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల, పట్టణానికి చెందిన బహుజన నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ కదిరి కృష్ణ రచించిన అద్వితీయ నాయకుడు పుస్తకాన్ని ప్రతి యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘ నాయకుడు మంకాల మల్లేష్ కు కదిరి కృష్ణ అందజేశారు.