భాగిర్థిపేట ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్ష

విద్యార్థులందరికీ ఆల్ ఇన్ వన్ పుస్తకాల బహూకరణ రేగోండ, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): భూపాలపల్లి జిల్లా భాగిర్థిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం హెల్ప్ టు నీడీ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రతిభా పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వారందరికీ ఆల్ ఇన్ వన్ పుస్తకాలను బహుమతులుగా అందజేశారు. జెన్కో కానిస్టేబుల్, కేటీపీపీకి చెందిన ఎన్. ఆంజనేయులు ఈ పుస్తకాలను అందించగా, హెల్ప్ టు నీడీ గ్రూప్ సభ్యుల చేతుల మీదుగా...