ఆరో రోజుకు చేరిన రాంకీ డంపింగ్ యార్డు వ్యతిరేక రిలే దీక్షలు

డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలి.. పాలకులు స్పందించకుంటే ఎన్నికల్లో తగిన మూల్యం తప్పదు: ప్రజా సంఘాల నేతల హెచ్చరిక జవహర్‌నగర్, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): రాంకీ చెత్త డంపింగ్ యార్డు తొలగింపు డిమాండ్‌తో చేపట్టిన ప్రజా ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది. డంపింగ్ యార్డు కారణంగా పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో ఆరో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ పాలకవర్గాలను హెచ్చరించారు....