రాజంపేట గ్రామపంచాయతీలో డిప్యూటీ కమిషనర్ సుధాకర్ పర్యటన
అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణపై క్షేత్రస్థాయి పరిశీలన.. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించాలని సూచన రాజంపేట, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): పంచాయతీరాజ్ కమిషనర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి దివ్య దేవరాజన్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ సుధాకర్ శుక్రవారం రాజంపేట గ్రామపంచాయతీలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రాజంపేటలోని జూబ్లీ మార్కెట్‌ను సందర్శించి చికెన్, మటన్, చేపల మార్కెట్ల నిర్వహణను తనిఖీ చేశారు. మార్కెట్ పరిసరాల్లో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను పరిశీలించారు. గ్రామంలోని ప్రధాన రహదారి మధ్య విభాజకాలను, గ్రామపంచాయతీ పరిధిలోని వివిధ ప్రాంతాలను గాలినడకన సందర్శించి పారిశుధ్య...