తెలంగాణ భూగర్భ జల శాఖ వెబ్‌సైట్ హ్యాక్ కలకలం.. అడల్ట్ సైట్‌కు మళ్లింపు

వెబ్‌సైట్‌లో మాల్‌వేర్ ప్రవేశించినట్లు అనుమానాలు.. పునరుద్ధరణకు అధికారుల చర్యలు హనుమకొండ, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాష్ట్ర భూగర్భ జల శాఖ అధికారిక వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైందనే అనుమానాలు కలకలం రేపుతున్నాయి. గురువారం నుంచి ఆ వెబ్‌సైట్‌ లింక్‌ను తెరిచినప్పుడు మరో వెబ్‌సైట్‌కు, అందులోనూ అనుచితమైన విషయాలు ఉన్న పేజీకి మళ్లింపు జరుగుతోందని నెటిజన్లు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా ఫిర్యాదులు చేశారు. అంతేకాకుండా, వెబ్‌సైట్‌ పేరుతో శోధన యంత్రాల్లోనూ అనుచిత పదాలు కనిపిస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. వెబ్‌సైట్‌లోకి హానికరమైన సాఫ్ట్‌వేర్‌ ప్రవేశించి ఉండవచ్చని సాంకేతిక నిపుణులు, అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఐటీ విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు....