తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల
రేపటి నుంచి శ్రీవాణి టికెట్ల బుకింగ్ ప్రారంభం.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు నవంబర్ 30న విడుదల హనుమకొండ, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం వెల్లడించింది. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టికెట్లు, దర్శన టోకెన్ల విడుదల షెడ్యూల్ను ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 28న ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. నవంబర్ 30న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు...