విదేశీ ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రభుత్వ కొత్త పథకం.. రూ.1.75 లక్షల వరకు సబ్సిడీ
హనుమకొండ, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలనుకునే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్’ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా తొలి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మంది అర్హులైన యువతకు ఆర్థిక సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంలో రెండు రకాల వలస విధానాలకు ప్రభుత్వం సబ్సిడీ అందించనుంది. నేరుగా విదేశీ ఉద్యోగాలకు వెళ్లే వారికి రూ.50 వేల వరకు, విదేశీ భాషా పరిజ్ఞానం ఆధారంగా ఉద్యోగాలకు వెళ్లే వారికి రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనుంది. మిగిలిన 50 శాతం మొత్తానికి బ్యాంకు రుణ...