బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం.. ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలి

తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): నిర్ణీత వయస్సు నిండకముందే బాలబాలికలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని సామాజికవేత్త, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొనికెన కుమారస్వామి అన్నారు. నవంబర్ 27న నిర్వహించే అంతర్జాతీయ బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా శుక్రవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026 సెప్టెంబర్ 4న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసి, ప్రతి సంవత్సరం నవంబర్ 27ను అంతర్జాతీయ బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా ఈ...