దొంగతనం, గంజాయి విక్రయాల ముఠా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్

రూ.15 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం, 6.2 కిలోల గంజాయి పట్టివేత సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం, నవంబర్ 28 (ప్రజానేస్తం జ్వాల): కోదాడ పట్టణంలో ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించిన ఘటనతో పాటు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును కోదాడ పట్టణ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.15 లక్షల విలువైన 9.150 తులాల బంగారు ఆభరణాలు, 12.3 తులాల వెండి ఆభరణాలు, రూ.16 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్‌తో పాటు మొత్తం 6.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా...