ఏడాదిలో 26 కేసులు.. 44 మంది నేరస్తులకు జైలు శిక్షలు

హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష.. 11 మందికి జీవిత ఖైదు సూర్యాపేట, నవంబర్ 28 (ప్రజానేస్తం జ్వాల): నేరస్తులకు చట్టప్రకారం శిక్షలు పడేలా పటిష్ట దర్యాప్తు చేపట్టాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ పోలీసు అధికారులకు సూచించారు. నేరస్తులకు శిక్షలు పడటం ద్వారా వారి ప్రవర్తనలో మార్పు రావడంతో పాటు నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు విధుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, నేరస్తులకు శిక్షల అమలు తదితర అంశాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, కోర్టు డ్యూటీ సిబ్బంది, కోర్టు లైజన్ అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాలు తగ్గి...