వికాస్ హైస్కూల్లో విద్యార్థుల మాక్ గ్రామసభ.. ప్రజాస్వామ్య పాలనపై అవగాహన
తొర్రూరు, నవంబర్ 28 (ప్రజానేస్తం జ్వాల): విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ, గ్రామ పరిపాలనపై అవగాహన కల్పించడంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించాలనే ఉద్దేశంతో తొర్రూరు మండలం వెలికట్ట శివారులోని వికాస్ హైస్కూల్ ఆవరణలో విద్యార్థుల ఆధ్వర్యంలో మాక్ గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు గ్రామ ప్రజాప్రతినిధుల పాత్రలను పోషించారు. డి.ఎస్. తరుణ్ సర్పంచ్‌గా, నందిని ఉపసర్పంచ్‌గా, మనోహర్ గ్రామ కార్యదర్శిగా వ్యవహరించారు. ఇతర విద్యార్థులు వార్డు సభ్యులు, గ్రామ ప్రజల పాత్రలు పోషిస్తూ గ్రామసభలో పాల్గొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, మౌలిక సదుపాయాల అవసరాలు, పారిశుధ్యం, గ్రామ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై విద్యార్థులు చర్చించారు. ప్రజల సమస్యలను ఎలా...