తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 182కు పెరిగే అవకాశం!
119 నుంచి 182కు పెంపుపై ప్రతిపాదనలు.. కొత్తగా 63 నియోజకవర్గాల ఏర్పాటు! హైదరాబాద్, నవంబర్ 29 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 182కు చేరవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలో కొత్తగా 63 నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ పరిసర జిల్లాలకు అధిక ప్రాధాన్యం 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674. ఈ జనాభా ఆధారంగా రూపొందించిన జిల్లాల...