మచ్చ బొల్లారం చెత్తను జవహర్‌నగర్‌కు తరలిస్తే ప్రజాగ్రహం తప్పదు
డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ హెచ్చరిక 8వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు.. చిన్నారుల ప్రసంగంతో ఉద్వేగభరితమైన దీక్షా శిబిరం జవహర్‌నగర్, నవంబర్ 29 (ప్రజానేస్తం జ్వాల): మచ్చ బొల్లారం ప్రాంతంలోని చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించే ప్రయత్నాలను విరమించుకోవాలని, లేనిపక్షంలో ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ నాయకులు హెచ్చరించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డును ఎత్తివేయాలని, స్థానిక ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ చెన్నాపురం క్రాస్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన...