Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వేములవాడలో రాష్ట్రస్థాయి కబడ్డీ సందడి

Author
Posted By Praja Nestham Jwala News
| 04 Oct 2026, 03:45 PM | Sports
వేములవాడలో రాష్ట్రస్థాయి కబడ్డీ సందడి

వేములవాడ, అక్టోబర్ 4 (ప్రజానేస్తం జ్వాల):వేములవాడలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల నిర్వహణ, క్రీడాకారుల ప్రతిభ, కబడ్డీ క్రీడ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పలువురు క్రీడా ప్రతినిధులతో చర్చించారు.ఈ సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను అల్లం ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కబడ్డీ క్రీడకు సంబంధించిన పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు.

తెలంగాణలో కబడ్డీకి గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఆదరణ ఉందని, ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ, పోటీ వేదికలు కల్పించాల్సిన అవసరం ఉందని క్రీడా ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం ద్వారా వివిధ జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.వేములవాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీల్లో 52వ బాలుర, 36వ బాలికల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బాలుర, బాలికల జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ పోటీలు అక్టోబర్ 5 వరకు కొనసాగనున్నాయి.కబడ్డీ వంటి గ్రామీణ క్రీడలను మరింత ప్రోత్సహించడం, యువ క్రీడాకారుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి క్రీడాకారులను తీర్చిదిద్దడం వంటి అంశాలపై ఈ సందర్భంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.