Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కీతవారిగూడెంలో గ్యాస్ సిలిండర్ చోరీ .. పోలీసులకు సమాచారం.

Author
Posted By Praja Nestham Jwala News
| 08 Oct 2026, 08:39 PM | క్రైమ్ న్యూస్
కీతవారిగూడెంలో గ్యాస్ సిలిండర్ చోరీ .. పోలీసులకు సమాచారం.

ఇంటి యజమాని చాకచక్యంతో ఇద్దరు దొంగలను పట్టివేత

కీతవారిగూడెం, అక్టోబర్ 8 (ప్రజానేస్తం జ్వాల):కీతవారిగూడెం గ్రామంలో గ్యాస్ సిలిండర్ చోరీకి పాల్పడ్డారని అనుమానం తో ఇద్దరు యువకులను ఇంటి యజమాని చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన చలిగంటి శివ ఇంట్లో రెండు రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ చోరీకి గురైనట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి గ్రామంలో నివాసం ఉంటున్న ఆంధ్రా కు చెందిన గుడివాడ పెద్ద ఉప్పి, గుడివాడ సాయి అనే ఇద్దరు యువకులపై అనుమానం రావడంతో వారిని గుర్తించి పట్టుకున్నట్లు శివ తెలిపారు.వీరికి గతంలో కూడా రోడ్డుపై ఉన్న మోటార్‌సైకిళ్లు, ఇనుప సామగ్రి తదితర వస్తువుల చోరీలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయని శివ పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.ఇద్దరిని పట్టుకున్న అనంతరం గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీకాంత్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు శివ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఇవి కూడా చదవండి

గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు, పరిచయం లేని వారి కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. ఇళ్లలోని విలువైన వస్తువులు, ద్విచక్ర వాహనాలు, గ్యాస్ సిలిండర్లు తదితర సామగ్రిని భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.