Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

లంచం డిమాండ్.. సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్

Author
Posted By Praja Nestham Jwala News
| 08 Oct 2026, 09:45 AM |
లంచం డిమాండ్.. సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్

  • జేసీబీలు, ట్రాక్టర్ల విడుదలకు రూ.లక్ష లంచం డిమాండ్


కరీంనగర్ జిల్లా, అక్టోబర్ 8 | ప్రజానేస్తం జ్వాల:జేసీబీలు, ట్రాక్టర్ల విడుదలకు రూ.లక్ష లంచం డిమాండ్ చేసి, వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేశ్, ఎస్సై అన్వర్‌తో పాటు ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

విచారణలో భాగంగా.. సంబంధిత వాహనాలకు చలానాలు చెల్లించి, తహసీల్దార్ నుంచి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు తీసుకొచ్చినప్పటికీ వాహనాలను అప్పగించలేదని తేలినట్లు తెలుస్తోంది. వాహనాల విడుదలకు రూ.లక్ష డిమాండ్ చేసి, చివరకు రూ.50 వేల వద్ద బేరం కుదుర్చుకుని డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి