Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భూ రక్షణ సమితి మండల అధ్యక్షుడిగా కడారి ఆదాం

Author
Posted By Praja Nestham Jwala News
| 09 Oct 2026, 06:51 AM |
భూ రక్షణ సమితి మండల అధ్యక్షుడిగా కడారి ఆదాం

భీమదేవరపల్లి, అక్టోబర్ 8 (ప్రజానేస్తం జ్వాల):భూ రక్షణ సమితి భీమదేవరపల్లి మండల అధ్యక్షుడిగా ముత్తారం గ్రామానికి చెందిన కడారి ఆదాంను నియమించారు. గురువారం హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో భూ రక్షణ సమితి సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జి వేముగంటి వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ నియామకాన్ని ప్రకటించారు.సమావేశానికి భూ రక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుగ్గ మైసన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిద్దెపాక సిద్దులు, రాష్ట్ర కార్యదర్శులు నల్ల నర్సింగరావు, నత్తి కొర్నెల్, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చౌదగారి సంజీవ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పాముల రమేష్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా కడారి ఆదాం మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రభుత్వం అసైన్మెంట్‌ కింద కేటాయించిన భూములను రెగ్యులరైజ్‌ చేయించేందుకు కృషి చేస్తానన్నారు. పేదల భూములకు సర్వ హక్కులు కల్పించేలా భూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కడారి ఆదాం కృతజ్ఞతలు తెలిపారు.