Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

త్రాగు నీరు పైపు పనులను ప్రారంభించిన సర్పంచ్

Author
Posted By Praja Nestham Jwala News
| 09 Oct 2026, 04:42 PM | హన్మకొండ
త్రాగు నీరు పైపు పనులను ప్రారంభించిన సర్పంచ్

వేలేరు, అక్టోబర్ 9 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా, వేలేరు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ నిధులతో చేపడుతున్న త్రాగునీరుకు సంబంధించిన నూతన పైపులైన్ పనులను వేలేరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేలేరు గ్రామ ప్రజలకు త్రాగునీరు అందించాలని ఉద్దేశంతో నూతన పైపులైను పనులను చేపట్టడం జరుగుతుందని గ్రామంలోని ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు తప్పకుండా చర్యలు తీసుకుంటానని గ్రామంలో ఎక్కడైనా త్రాగునీరు సమస్య ఉంటే త్వరలో పరిష్కరిస్తానని గౌరవ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి సహకారంతో గ్రామాభివృద్ధి జరుగుతుందని, సర్పంచ్ మాట్లాడడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్ ,జిపి కార్యదర్శి విజయ వార్డు సభ్యులు లక్ష్మీనారాయణ, ఫర్విన్, సురేష్ ,మరియు గ్రామ పెద్దలు, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి