Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భీమదేవరపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా రాజ్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

Author
Posted By Praja Nestham Jwala News
| 09 Oct 2026, 05:20 PM | TELANGANA
భీమదేవరపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా రాజ్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

  • నూతన కార్యవర్గం ఎంపిక.. పాత్రికేయుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

భీమదేవరపల్లి, అక్టోబర్‌ 9 (ప్రజానేస్తం జ్వాల):హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ కల్యాణ మండపంలో భీమదేవరపల్లి ప్రెస్‌ క్లబ్‌ (రిజి. నం. 629/2022) మూడో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సభ్యులు తెలిపారు.గౌరవాధ్యక్షుడు మాడుగుల సంతోష్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా మాడుగుల రాజ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా మాడుగుల రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా గౌడ చంద్రబాబు, కోశాధికారిగా ఉడుత శ్రీనాథ్‌, కార్యదర్శిగా కనకం వెంకటేష్‌ ఎన్నికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా మేకల శ్యామ్‌, మాట్ల హరికుమార్‌, వెంకటేష్‌ ఎన్నిక కాగా, సభ్యులుగా కడారి బాబు, రజినీకాంత్‌, అఖిల్‌, సంజీవ్‌, ఉదయ్‌, గోపికృష్ణ వ్యవహరించనున్నారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గం పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సమావేశంలో ఆకాంక్షించారు.