Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బతుకమ్మ సంబరాలకు సర్పంచ్‌ చొరవ

Author
Posted By Praja Nestham Jwala News
| 09 Oct 2026, 05:23 PM | TELANGANA
బతుకమ్మ సంబరాలకు సర్పంచ్‌ చొరవ

  • మహిళల సౌకర్యార్థం తాళ్లకుంట సమీపంలో స్థలం శుభ్రం

శాయంపేట, అక్టోబర్‌ 9 (ప్రజానేస్తం జ్వాల): సద్దుల బతుకమ్మ వేడుకల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాయంపేట గ్రామ సర్పంచ్‌ చింతల ఉమా-రవిపాలు, ఉపసర్పంచ్‌ దైనంపల్లి సుమన్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాళ్లకుంట సమీపంలో ట్రాక్టర్‌ సాయంతో గడ్డి, పిచ్చిమొక్కలను తొలగించి బతుకమ్మ వేడుకలకు అనువుగా స్థలాన్ని శుభ్రం చేయించారు.మహిళలు బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ ఆటపాటలతో పండుగను ఆనందంగా జరుపుకునేందుకు వీలుగా పరిసరాలను సిద్ధం చేశారు. పండుగకు హాజరయ్యే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొత్తపల్లి రవీందర్‌, తట్ల ప్రవళిక-సాయి తదితరులు సహకరించారు.