Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గౌరవెల్లి ప్రాజెక్టు అవార్డు జాబితాపై ఆర్డీవో విచారణ

Author
Posted By Praja Nestham Jwala News
| 14 Oct 2026, 03:05 PM |
గౌరవెల్లి ప్రాజెక్టు అవార్డు జాబితాపై ఆర్డీవో విచారణ

భీమదేవరపల్లి, అక్టోబర్‌ 14 (ప్రజా నేస్తం జ్వాల): గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి అవార్డు జాబితాలోని వివరాలపై ఆర్డీవో ఎన్. వెంకటేష్ విచారణ చేపట్టారు. ప్రాజెక్టు పరిధిలోని ఏడు గ్రామాలకు సంబంధించిన అవార్డు జాబితాను పరిశీలించి, అందులోని వివరాలపై సంబంధిత గ్రామాల ప్రజల నుంచి సమాచారం సేకరించారు. ఈ విచారణలో భాగంగా కొత్తకొండ, గట్ల నర్సింగాపూర్, ముస్తాఫాపూర్, ముల్కనూర్, వంగర, మల్లారం, ముత్తారం గ్రామాలకు సంబంధించిన అవార్డు జాబితాలోని అంశాలను అధికారులు పరిశీలించారు. ఆయా గ్రామాలకు చెందిన ప్రజల నుంచి వివరాలు తెలుసుకుంటూ, జాబితాలో పొందుపరిచిన సమాచారంపై విచారణ నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి అవార్డు జాబితాలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించే ప్రక్రియలో భాగంగా ఈ విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి తహసీల్దార్ బి. రాజేష్‌తో పాటు సంబంధిత గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.