Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఆర్టీఐ అమలులో రాష్ట్రస్థాయిలో సూర్యాపేటకు అగ్రస్థానం

Author
Posted By Praja Nestham Jwala News
| 14 Oct 2026, 05:07 PM |
ఆర్టీఐ అమలులో రాష్ట్రస్థాయిలో సూర్యాపేటకు అగ్రస్థానం

  • జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌కు ఎస్పీ కె. నరసింహ అభినందనలు

  • పారదర్శక పాలనకు రాష్ట్రస్థాయి గుర్తింపు.. జిల్లా యంత్రాంగం కృషికి ప్రశంసలు

సూర్యాపేట, అక్టోబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ–2005) అమలులో రాష్ట్రస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా సూర్యాపేట గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌ను జిల్లా ఎస్పీ కె. నరసింహ బుధవారం కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంతో పాటు సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం కనబరిచిన పనితీరుకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ నాయకత్వంలో సూర్యాపేట జిల్లాకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు రావడం గర్వకారణమని తెలిపారు.ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించడం, ప్రభుత్వ శాఖల పనితీరులో పారదర్శకతను పెంపొందించడం, ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపడం వంటి అంశాల్లో జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఎస్పీ కొనియాడారు.భవిష్యత్తులోనూ జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సమర్థవంతమైన పరిపాలనలో సూర్యాపేట జిల్లా మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆకాంక్షించారు.