Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పోటీ పరీక్షల అభ్యర్థులకు ఊరట.. హుజూర్‌నగర్ లైబ్రరీకి 60 కుర్చీలు, 60 ప్యాడ్లు

Author
Posted By Praja Nestham Jwala News
| 14 Oct 2026, 05:09 PM | ఎడ్యుకేషన్
పోటీ పరీక్షల అభ్యర్థులకు ఊరట.. హుజూర్‌నగర్ లైబ్రరీకి 60 కుర్చీలు, 60 ప్యాడ్లు

  • కలెక్టర్ చొరవతో పాఠకులకు మెరుగైన సౌకర్యాలు.. నిరుద్యోగ యువతకు చదువుకు మరింత వెసులుబాటు

హుజూర్‌నగర్, అక్టోబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్‌నగర్ బ్రాంచ్ లైబ్రరీకి వచ్చే పాఠకులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత సౌకర్యార్థం 60 కుర్చీలు, 60 ప్యాడ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచనల మేరకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనూష పర్యవేక్షణలో వీటిని సమకూర్చారు.ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ బచ్చు రామారావు మాట్లాడుతూ, కొత్త సదుపాయాలు అభ్యర్థులకు చదువుకునేందుకు ఉపయోగపడతాయని తెలిపారు.కార్యక్రమంలో లైబ్రేరియన్ కంచెర్ల శ్రీధర్ రెడ్డి, సిబ్బంది కస్తాల మధు, రిటైర్డ్ కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ బీరెల్లి శ్రీనివాస్ రెడ్డి, పాఠకులు, పోటీ పరీక్షల అభ్యర్థులు పాల్గొన్నారు.