Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జనగణన–2027లో తప్పిదాలకు తావివ్వొద్దు

Author
Posted By Praja Nestham Jwala News
| 14 Oct 2026, 05:44 PM |
జనగణన–2027లో తప్పిదాలకు తావివ్వొద్దు

హనుమకొండ, అక్టోబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): జనగణన–2027 ప్రక్రియను అత్యంత ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న సూచించారు.బుధవారం వరంగల్ మహానగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో ఛార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనగణనలో భాగంగా హౌస్ లిస్టింగ్ బ్లాకులను ఎన్యుమరేషన్ బ్లాకులుగా మార్చే ప్రక్రియ, క్షేత్రస్థాయిలో వివరాల నమోదు, డిజిటల్ విధానాలు, సాంకేతిక అంశాలపై సిబ్బంది పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.జనాభా లెక్కల సేకరణ ప్రభుత్వ ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలకు కీలకమని పేర్కొంటూ, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా విధులు నిర్వహించాలని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి జనగణన–2027 విజయవంతానికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు.