Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మహిళా కౌన్సిలర్లపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదు

Author
Posted By Praja Nestham Jwala News
| 05 Nov 2026, 05:54 PM |
మహిళా కౌన్సిలర్లపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదు

11వ వార్డు కౌన్సిలర్ వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు వినతి

హుజూర్‌నగర్, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల):

మహిళా ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హుజూర్‌నగర్ మున్సిపాలిటీకి చెందిన మహిళా కౌన్సిలర్లు స్పష్టం చేశారు. 11వ వార్డు కౌన్సిలర్ పులిచింతల వెంకట్ రెడ్డి తమపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ, వాటిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఇవి కూడా చదవండి

ఈ నెల 4న వెంకట్ రెడ్డి కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో అధికారిక సమావేశాలు, చర్చల్లో మహిళా కౌన్సిలర్లకు బదులుగా వారి భర్తలు పాల్గొంటున్నారని పేర్కొనడాన్ని మహిళా కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించారు. కౌన్సిల్ సమావేశాల్లో కౌన్సిలర్లు తప్ప ఇతర వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఎవరూ పాల్గొనలేదని స్పష్టం చేశారు.

తమ కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించేలా దురుద్దేశపూర్వక ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ కుటుంబ సభ్యులు సమావేశాల్లో పాల్గొన్నట్లయితే వారిని సమావేశ మందిరంలోకి ఏ ప్రాతిపదికన అనుమతించారో చైర్మన్, కమిషనర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మహిళా ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలగకుండా చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని మహిళా కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు.