Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రూ.3 లక్షల బిల్లుల కోసం రూ.లక్ష లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన స్పోర్ట్స్ అధికారి!

Author
Posted By Praja Nestham Jwala News
| 05 Nov 2026, 06:22 PM |
రూ.3 లక్షల బిల్లుల కోసం రూ.లక్ష లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన స్పోర్ట్స్ అధికారి!

కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా పట్టుబడిన అధికారి, కంప్యూటర్ ఆపరేటర్

మహబూబ్‌నగర్, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల):

రూ.3 లక్షల విలువైన కాంట్రాక్టర్ బిల్లుల చెల్లింపు కోసం రూ.లక్ష లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా మహబూబ్‌నగర్ జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి రాజేందర్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కాంట్రాక్టర్‌కు రావాల్సిన రూ.3 లక్షల బిల్లుల చెల్లింపునకు అధికారి రూ.లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఇవి కూడా చదవండి

దీంతో గురువారం క్లాక్‌టవర్ సమీపంలోని ఓ హోటల్‌లో కాంట్రాక్టర్ నుంచి రూ.లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.