Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక ఆకాశదీపం

Author
Posted By Nagilla Rajinikanth
| 14 Nov 2026, 07:20 PM |
కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక ఆకాశదీపం

ప్రదోష వేళలో దీపారాధన.. భక్తుల ప్రత్యేక పూజలు

కొత్తకొండ, నవంబర్ 14, (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆకాశదీపం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజూ ప్రదోష వేళలో ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆకాశదీపాన్ని వెలిగిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు దీపంలో నూనె పోసి భక్తిశ్రద్ధలతో దీపారాధనలో పాల్గొంటున్నారు.

ఆకాశదీపం వెలిగించడం వల్ల అపమృత్యు దోషాలు తొలగి, సకల శుభాలు కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కార్తీక మాసం నెలరోజుల పాటు ప్రతిరోజూ ప్రదోష వేళలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు ఆకాశదీప కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ వర్గాలు కోరాయి.

ఇవి కూడా చదవండి