Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి

Author
Posted By Praja Nestham Jwala News
| 17 Nov 2026, 07:59 AM |
బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి

కుమురం భీమ్ ఆసిఫాబాద్, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి చట్టపరమైన పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి నేరుగా వివరించి ఫిర్యాదులు సమర్పించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ సావధానంగా విని, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బాధితుల ఫిర్యాదుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని, ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతతో పరిశీలించి నిర్ణీత సమయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ శాఖ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ సూచించారు.