Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తొర్రూరు మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్ జలగం మీనేశ్వర్ సస్పెండ్.

Author
Posted By Kommanaboina Yakaiah
| 22 Nov 2026, 09:14 AM | Array
తొర్రూరు మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్ జలగం మీనేశ్వర్ సస్పెండ్.

ముఖ్యమైన పాయింట్స్:

  • రెండు పడక గదుల కేటాయింపులో లంచం అడిగినందుకు రేటు.
  • విచారణ అనంతరం సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్.
  • ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెబితే నమ్మొద్దు తక్షణమే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి.

మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు పట్టణంలోని 1, 9వ వార్డులలో వార్డు ఆఫీసర్ గా పనిచేయుచున్న జలగం మీనేశ్వర్, 2 పడకల గదుల కేటాయింపులలో లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేసినందున అట్టి విషయం రుజువైనందున.. సదరు ఉద్యోగిపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల నుండి తొలగించడం జరిగిందని, (సస్పెన్షన్) జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలు, లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తే సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.2 పడకల గదులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని మాయమాటలు చెబితే డబ్బులు అడిగితే వెంటనే సమాచారం అందించాలని, ప్రభుత్వ ఉద్యోగులు నిస్వార్ధమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతంగా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.