Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కుటుంబ జీవిత బీమా పథకానికి ప్రత్యేక కౌంటర్.

Author
Posted By Praja Nestham Jwala News
| 23 Nov 2026, 01:17 PM |
కుటుంబ జీవిత బీమా పథకానికి ప్రత్యేక కౌంటర్.

•అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి..

•ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.

నేరేడుచర్ల, (ప్రజా నేస్తం జ్వాల) నవంబర్ 23: కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను నేరేడుచర్ల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ వద్ద మున్సిపల్ కమిషనర్ నాగరాజు పరిశీలించారు.ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. పథకానికి అర్హులై ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు తెలియజేశారు. దరఖాస్తుల స్వీకరణ సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సిబ్బంది సహకరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ ఇంజమూరి వెంకటమ్మ పాల్గొని మాట్లాడుతూ, 10వ వార్డులో కుటుంబ జీవిత బీమా పథకానికి అర్హులై దరఖాస్తు చేసుకోని వారు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సహకారం అందిస్తూ దరఖాస్తుల ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బంది పనిచేయాలని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి