Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మాదకద్రవ్యాల నివారణ యువత సహకారంతోనే సాధ్యం. తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జ్ దామెర ధీరజ్ కుమార్.

Author
Posted By Kommanaboina Yakaiah
| 23 Nov 2026, 10:23 PM | మహబూబాబాద్, వరంగల్ రూరల్
మాదకద్రవ్యాల నివారణ యువత సహకారంతోనే సాధ్యం.  తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జ్ దామెర ధీరజ్ కుమార్.

ముఖ్యమైన పాయింట్స్:

  • ఆర్యభట్ట పాఠశాలలో మాదకద్రవ్యాల వినియోగం రవాణాపై విద్యార్థులకు అవగాహన.

తొర్రూరు మహబూబాబాద్ జిల్లా నవంబర్ 23 ప్రజానేస్తం జ్వాల//..

మాదకద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా నివారణ యువత సహకారంతోనే సాధ్యపడుతుందని, ప్రతి ఒక్కరూ పాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు తదితర వాటిపై అవగాహన పెంచుకొని మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తొర్రూరు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి దామెర ధీరజ్ కుమార్ అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ జిల్లా న్యాయ సేవధికార సంస్థ మహబూబాబాద్ ఆదేశాల మేరకు, మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో 'డ్రగ్ అవేర్‌నెస్ అండ్ వెల్‌నెస్ నావిగేషన్ పథకం, 2025' అమలులో ఈ పథకం ద్వారా మండల న్యాయ సేవాధికార సంస్థ, తొర్రూరు ఆధ్వర్యంలో సోమవారం ఆర్యబట్ట స్కూల్ లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల బాధితులకు, వారి కుటుంబాలకు, మహిళలకు మరియు పిల్లలకు ఉచిత న్యాయ సలహాలు, న్యాయవాదుల సేవలు అందించబడతాయని, పాఠశాలలు, కళాశాలలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపైన మత్తు పదార్థాలకు బానిసైన వారిని గుర్తించి, ప్రభుత్వ డీ-అడిక్షన్ కేంద్రాలు, కౌన్సెలింగ్ కేంద్రాలకు అనుసంధానం చేయడం జరుగుతుందని అన్నారు. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఉచిత న్యాయ సేవలకోసం 15100, మాదకద్రవ్యాల నియంత్రణ డి అడిక్షన్ టెలి కౌన్సిలింగ్ కోసం 1933 / 14446 ఈ నెంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, కరస్పాండెంట్ మధుకర్ రెడ్డి, అడ్వకేట్లు ఎం నాగరాజు, టి నాగరాజు, బి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల నివారణ యువత సహకారంతోనే సాధ్యం.  తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జ్ దామెర ధీరజ్ కుమార్. - Additional Image