Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవతో చర్చి రోడ్డుకు సీసీ రోడ్డు

Author
Posted By Praja Nestham Jwala News
| 25 Nov 2026, 06:51 PM |
ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవతో చర్చి రోడ్డుకు సీసీ రోడ్డు

వేలేరు, నవంబర్ 25 (ప్రజానేస్తం జ్వాల): వేలేరు మండల కేంద్రంలోని చర్చి హాస్టల్ వరకు సుమారు 350 మీటర్ల పొడవున నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి ప్రారంభించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో మంజూరైన నిధులతో ఈ పనులు చేపట్టారు. బైరి రవి ఇంటి నుంచి చర్చి హాస్టల్ వరకు ఉన్న రహదారి అధ్వానంగా ఉండటంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ తెలిపారు. ఈ సమస్యను ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగానే ఆయన తక్షణమే స్పందించి ప్రత్యేక నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించిన ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా సర్పంచ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో వేలేరు గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ సంక్ష