Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జనతా ప్రమాద బీమాతో బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం

Author
Posted By Nagilla Rajinikanth
| 25 Nov 2026, 06:53 PM |
జనతా ప్రమాద బీమాతో బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం

భీమదేవరపల్లి, నవంబర్ 25 (ప్రజానేస్తం జ్వాల): ప్రమాద బీమా పథకం ద్వారా మృతురాలి కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందింది. ములుకనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సంఘం ఆధ్వర్యంలో ఇఫ్కో టోక్యో జనతా ప్రమాద బీమా పథకం కింద మంజూరైన బీమా క్లెయిమ్ చెక్కును సంఘ అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. గట్లనర్సింగాపూర్ గ్రామానికి చెందిన బరిగె శోభ వడదెబ్బతో మృతి చెందగా, ఆమె భర్త బరిగె సంపత్‌కు రూ.2 లక్షల బీమా పరిహారం మంజూరైంది. ఈ మేరకు చెక్కును ఆయనకు అందించారు.

ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయ సేవలు అందించడంతో పాటు సహకార సంఘం సభ్యుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో సంఘం ముందుంటుందని తెలిపారు. సభ్యుల మరణానంతరం వారి కుటుంబాలకు జనతా ప్రమాద బీమా పథకం ఆర్థికంగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.