Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రాష్ట్రస్థాయి రోల్‌ప్లే పోటీల్లో ఇమాంపేట మోడల్ స్కూల్‌కు తృతీయ బహుమతి

Author
Posted By Praja Nestham Jwala News
| 25 Nov 2026, 06:56 PM |
రాష్ట్రస్థాయి రోల్‌ప్లే పోటీల్లో ఇమాంపేట మోడల్ స్కూల్‌కు తృతీయ బహుమతి

సూర్యాపేట, నవంబర్ 25 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాష్ట్రస్థాయి రోల్‌ప్లే పోటీల్లో సూర్యాపేట జిల్లా ఇమాంపేట తెలంగాణ మోడల్ స్కూల్ (TGMS) విద్యార్థులు ప్రతిభ కనబరిచి తృతీయ బహుమతి సాధించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణ, నిర్వహణ అనే అంశంపై విద్యార్థులు ప్రదర్శించిన రోల్‌ప్లేకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఎస్‌సీఈఆర్‌టీ తెలంగాణ, పాపులేషన్ ఎడ్యుకేషన్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఇమాంపేట మోడల్ స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనతో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విజేతలకు మెమెంటో, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ పోటీల్లో బుద్ధిద సమీక్ష, గుగులోతు శ్రేయ శ్రీ, కట్ట అక్షర, రేకల మాథ్యూ కుమార్, సాలిగంటి తరుణ్ సాయి పాల్గొని ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల ప్రదర్శనను ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రమేష్ అభినందించారు. వారికి మార్గదర్శకత్వం వహించిన ఆంగ్ల ఉపాధ్యాయుడు దండెం రవికుమార్‌ను సైతం ప్రశంసించారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చిన విద్యార్థులను సూర్యాపేట మండల విద్యాధికారి (ఎంఈఓ), జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. మల్లయ్య, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడంతో పాటు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని వారు పేర్కొన్నారు.